కియారాను కన్ఫర్మ్ చేస్తున్నారా..?

కియారాను కన్ఫర్మ్ చేస్తున్నారా..?

త్రివిక్రమ్ శ్రీనివాస్.. బన్నీ కాంబినేషన్లో సినిమా త్వరలోనే స్టార్ట్ కాబోతున్నది.  జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల లాగే ఇది కూడా తండ్రి సెంటిమెంట్ తో కూడిన సినిమానే.  ఇందులో నటించే హీరోయిన్ల కోసం త్రివిక్రమ్.. అనేక పేర్లను పరిశీలించారు.  ఫైనల్ గా రెండు పేర్లను సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.  అందులో ఒకరు కియారా అద్వానీ కాగా రెండో పేరు రష్మిక.  

ఈ ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.  అందుతున్న సమాచారం ప్రకారం కియారా అద్వానీని ఫైనల్ చేస్తున్నారని సమాచారం.  భరత్ అనే నేను సినిమా ద్వారా  టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  రీసెంట్ గా రామ్ చరణ్ తో వినయ విధేయ రామ చేసింది.  కమర్షియల్ సినిమాలకు కియారా ఐతే బాగుందని భావించిన యూనిట్ కియారా వైపు మొగ్గు చూపించినట్టు సమాచారం.