మహేష్ బాలీవుడ్లో ఎంట్రీ.. ఇలా ఉంటుందా..?

మహేష్ బాలీవుడ్లో ఎంట్రీ.. ఇలా ఉంటుందా..?

మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ ప్లాప్ ఏది అంటే స్పైడర్ అనే అంటారు.  భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా అదే రేంజ్ లో పరాజయాన్ని మూటగట్టుకుంది.   తెలుగులో ఈ సినిమా ఊహించని విధంగా ప్లాప్ అయింది.  కానీ, తమిళంలో మాత్రం సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  భారీ హిట్ తో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకున్న మహేష్ కు ఓ మోస్తరు విజయంతో ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది.  

కాగా, మహేష్ బాబు బాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.  పోకిరి సినిమా టైం నుంచే మహేష్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.  మహేష్ కూడా ఈ వార్తలను కొట్టేయ్యలేదు.  మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తానని పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.  కాగా, ఇప్పుడు మరోవార్త మీడియాలో చెక్కర్లు కొడుతోంది.  మహేష్ బాబు త్వరలోనే బాలీవుడ్ లో అడుగుపెడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  మహేష్ తో స్పైడర్ సినిమాను తీసిన మురుగదాస్ అదే సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారట.  అదీ మహేష్ బాబుతోనే.  ఈ వార్త నిజమైతే.. అది మహేష్ అభిమానులకు ఒక షాక్ అనే చెప్పొచ్చు.  మహేష్ బాబు స్పైడర్ తో బిగ్గెస్ట్ ప్లాప్ అందుకున్నాడు.  ఈ ప్లాప్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎలా ఎంటర్ అవ్వాలని అవ్వాలని అనుకున్నాడు.  గజినీ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన మురుగదాస్ పై నమ్మకంతో స్పైడర్ రీమేక్ కు ఒప్పుకున్నాడా.. అసలు ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉన్నదనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.