అక్కడ మజిలీని రీమేక్ చేస్తున్నారట...

అక్కడ మజిలీని రీమేక్ చేస్తున్నారట...

టాలీవుడ్ లో ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో రెండు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి.  అందులో ఒకటి ఎఫ్ 2 కాగా, రెండో సినిమా మజిలీ.  మజిలీ హిట్ అవుతుందని ఊహించారుగాని, ఈ స్థాయిలో హిట్ అవుతుందని ఎవరు ఊహించలేదు.  నాగచైతన్య కెరీర్లో ఈ సినిమా ది బెస్ట్ గా నిలిచింది.  

నాగచైతన్య పాత్రను డిజైన్ చేసిన తీరు అమోఘం.  అటు సమంత యాక్టింగ్ కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యింది.  ఈ సినిమా కోలీవుడ్ రైట్స్ ను ధనుష్ నిర్మాణ సంస్థ  వుండర్బర్ ఫిలిమ్స్ సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాను డబ్బింగ్ చేసి రిలీజ్ చేయకుండా... రీమేక్ చేసే ఆలోచనలో ధనుష్ ఉన్నాడని సమాచారం.  గతంలో రఘువరన్ బిటెక్ సినిమా కూడా ఫెయిల్యూర్ స్టోరీగా వచ్చి సూపర్ హిట్టైంది.  మజిలీని కూడా తమిళంలో రీమేక్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట.  మరి ఈ రీమేక్ లో ధనుష్ నటిస్తారో లేదంటే మరెవరైనా చేస్తారో చూడాలి.