మెగాస్టార్ 152 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

మెగాస్టార్ 152 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

మెగాస్టార్ చిరంజీవి 151 వ  సైరా తరువాత చేస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు.  ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.  ఇటీవలే ఈ మూవీ అధికారికంగా ప్రారంభం అయ్యింది.  నవంబర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్నది.  

ఈ మూవీకి సంబంధించిన పక్కా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయింది.  సెట్స్ మీదకు వెళ్లడమే ఆలస్యం.  కాగా, సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్డేట్ బయటకు వచ్చింది.  ఈ సినిమాను సమ్మర్  స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.  దానికి తగ్గట్టుగానే షూటింగ్ ను రాపిడ్ స్పీడ్ గా పూర్తి చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది.  ఈ మూవీ తరువాత మెగాస్టార్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉన్నది.