విజయ్ కు హ్యాండ్ ఇచ్చిన నయన్.. మెగా ఈవెంట్ కు హాజరవుతుందా?

విజయ్ కు హ్యాండ్ ఇచ్చిన నయన్.. మెగా ఈవెంట్ కు హాజరవుతుందా?

సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ నయనతార సినిమాలో యాక్ట్ చేయడం వరకే చేస్తుంది.. ప్రమోషన్ విషయంలో దూరంగా ఉంటుంది అనే టాక్ ఉన్నది.  చెప్పినట్టుగానే నయన్ ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నది.  సినిమాకు అగ్రిమెంట్ చేసుకునే సమయంలోనే ఈ విషయాన్ని నయనతార స్పష్టంగా పేర్కొంటుంది.  దానికి ఒకే అంటేనే ఆమె సినిమా చేస్తుంది.  లేదంటే ఎంత పెద్ద సినిమా అయినా సరే పక్కన పెడుతుంది.  

కాగా, విజయ్ తో చేస్తున్న బిగిల్ సినిమా ప్రమోషన్లో నయనతార పాల్గొంటుంది అనే వార్తలు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు.  కానీ, నిన్నటిరోజున జరిగిన బిగిల్ ఆడియో వేడుకకు నయనతార హాజరుకాలేదు.  హీరోయిన్ లేకుండానే ఆడియో వేడుక జరిగింది.  ఈనెల 22 వ తేదీన మెగాస్టార్ సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నది.  ఈ వేడుకకు నయన్ హాజరవుతుందా అన్నది సందేహంగా మారింది.  అమితాబ్ లాంటి పెద్ద స్టార్స్ ఈ వేడుకకు వస్తున్నారు కాబట్టి ఎలాగైనా నయనతారను తీసుకురావాలని నిర్మాత రామ్ చరణ్ ప్రయత్నాలు చేస్తున్నారు.  మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.