నోటాకు భారీ కాంపిటీషన్..!!

నోటాకు భారీ కాంపిటీషన్..!!

గీత గోవిందం ఈ ఏడాది బెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.  మీడియం రేంజ్ సినిమాగా విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరి అందర్నీ ఆశ్చర్యపరిచింది.  ఈ సినిమా హిట్ తో విజయ్ దేవరకొండ స్టార్ మరింతగా పెరిగింది.  తన నెక్స్ట్ సినిమా నోటాపై దీని ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తున్నది.  

తమిళ, తెలుగు భాషల్లో నిర్మితమైన ఈ సినిమా అక్టోబర్ 5 వ తేదీన విడుదల కాబోతున్నది.  పొలిటికల్ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.  ఇప్పటికే రిలీజైన ట్రైలర్ హిట్ కావడంతో.. అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఇదిలా ఉంటె, సెప్టెంబర్ 27 వ తేదీన నాగార్జున.. నానీల మల్టీస్టారర్ దేవదాస్ విడుదల కాబోతున్నది.  ఇప్పటికే ఈ సినిమా పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది.  ఈ సినిమా హిట్టయితే.. దీనిప్రభావం అక్టోబర్ 5 న రిలీజ్ అయ్యే నోటా పై పడుతుంది అనడంలో సందేహం లేదు.  మరోవైపు అక్టోబర్ 11 వ తేదీన ఎన్టీఆర్ అరవింద సమేత రిలీజ్ అవుతున్నది.  ఆ సినిమాకు కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో ఈ రెండు సినిమాల మధ్యలో విడుదలౌతున్న నోటా, ఆ రెండు సినిమాల కాంపిటీషన్ను తట్టుకొని ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.