ఎన్‌టీఆర్ కొత్త సినిమా పేరు అది కాదట..?

ఎన్‌టీఆర్ కొత్త సినిమా పేరు అది కాదట..?

యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, త్రివిక్రమ్ కాంబో రానున్న సినిమా గురించి తెలిసిందే. దీని గురించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. వీరి కాంబోలో ఇదివరకే వచ్చిన అరవింద సమేతా భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అందులో వీర రాఘవగా కనిపించిన ఎన్‌టీఆర్ అందరినీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మళ్లీ వీరి కాంబోలో మరో సినిమా రానుందనడంతో అభిమానులు దీని కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వీరు చేయనున్న సినిమాకు ఇప్పటి వరకు అయినను పోయిరావలే హస్తినకు అనే పేరును అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాకు త్రివిక్రమ్ సెంటిమెంట్ ‘అ’ను పక్కన పెట్టి కొత్తగా నాయుడు సెంటిమెంట్‌తో పేరును పెట్టనున్నారట. ఈ చిత్రానికి ఎన్‌టీఆర్ ‘చౌడప్ప నాయుడు’ అనే పేరును సజెస్ట్ చేశాడు. దీంతో ఈ సినిమా పేరు ఏమని పెడతారన్న విషయం ప్రస్తుతం ఎన్‌టీఆర్ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దేశంలోని నీఛ రాజకీయాలపై ఓ యువకుడు చేసే పోరాటంగా ఈ సినిమా తెరకెక్కనుందట. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా పేరు కూడా ఫైనల్ కావాలి. మరి ఈ సినిమాకు త్రివిక్రమ్ సెంటిమెంట్ వస్తుందా లేదా నాయుడు సెంటిమెంట్‌తో పేరు ఖరారు అవుతుందా అనేదాని కోసం వేచి చూడాలి.