ఎన్‌టీఆర్ ఇద్దరు భామలతో రొమాన్స్ చేయనున్నాడా?

ఎన్‌టీఆర్ ఇద్దరు భామలతో రొమాన్స్ చేయనున్నాడా?

త్రివిక్రమ్, ఎన్‌టీఆర్ కాంబో అప్‌డేట్ కోసం అభిమానులు కళ్ళప్పగించి ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఎన్‌టీఆర్‌కి విలన్‌గా ఎవరు కనిపించనున్నారన్న దానిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ప్రతినాయకుడి విషయం పక్కన పెడితే ఇందులో చేయనున్న హీరోయిన్‌పై కూడా సరైన క్లారిటీ లేదు. అయితే ఇటీవల వస్తున్న వార్తలు ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్‌లు చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమాలో ఎన్‌టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రష్మికా మందాన చేయనుందన్నారు. ఇదిలా ఉంటే నిన్న పూజా చేసిన వ్యాఖ్యలు దీనిపై అనేక ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. తాను త్రవిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాని బుట్ట బొమ్మ నోరు జారింది. దాంతో ఈ సినిమాలో ఎన్‌టీఆర్ ఇద్దరు భామలతో రొమాన్స్ చేయనున్నాడని అని అభిమానులు అనుకుంటున్నారు. మరి ఈ సినిమాలో ఎంతమంది కథానాయికలు చేయనున్నారన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రష్మికా వరుస సినిమాలు చేస్తోంది. బాలీవుడ్‌లో రెండు సినిమాలకు ఓకే చెప్పిన లక్కీ బ్యూటీ తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో కూడా చేస్తోంది. ఇక పూజ విషయానికొస్తే ఈ అమ్మడు కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా గుడుపుతోంది. ఇటీవల బాలీవుడ్‌లో రెండు సినిమాలను పూర్తి చేసుకుంది. అంతేకాకుండా తెలుగులో అఖిల్ అక్కినేని సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో చేసింది. దీంతో పాటుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో రాధేశ్యామ్ సినిమాలో కూడా కనిపించనుంది. అయితే ఎన్‌టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో రానున్న సినిమాలో వీరిద్దరూ హీరోయిన్లుగా చేయనున్నారా అని అభిమానలు నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. దీని పై క్లారిటీ ఇవ్వాల్సింది.