ఎన్టీఆర్ అభిమానుల భయాన్ని పూజ బ్రేక్ చేస్తుందా..?

ఎన్టీఆర్ అభిమానుల భయాన్ని పూజ బ్రేక్ చేస్తుందా..?

ఎన్టీఆర్ అరవింద సమేత అక్టోబర్ 11 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.  ఎన్టీఆర్.. త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోను మొదలైంది.  ఇప్పటికే రిలీజైన సాంగ్స్ హిట్ కావడంతో పాటు సెంటిమెంట్, ఎమోషన్స్ ఎక్కువగా ఉండటంతో సినిమాకు హైప్ వచ్చింది.  

ఇంతవరకు ఒకెత్తయితే.. ఇప్పుడు అభిమానులకు మరో భయం పట్టుకుంది.  హీరోయిన్ పూజ హెగ్డే చిత్రాలు చూసుకుంటే.. ఒక్కటి కూడా హిట్ లేదు.  ముకుందా దగ్గరి నుంచి.. దువ్వాడ జగన్నాధం వరకు లేటెస్ట్ గా వచ్చిన సాక్ష్యం సినిమా చూసుకున్నా యావరేజ్ సినిమాలే.  ఎన్టీఆర్.. త్రివిక్రమ్ సినిమా అతి పెద్ద సినిమా.  ఈ సినిమాలో పూజ యాక్టింగ్ బాగుందని టాక్ వినిపిస్తున్నది.  పూజ గత సినిమాలు జస్ట్ యావరేజ్ గా నిలవడంతో ఎన్టీఆర్ సినిమా ఎలా ఉంటుందో  అని భయపడుతున్నారు.  పూజ హెగ్డే ఈ సినిమా ద్వారా బ్రేక్ సాధిస్తుందని ఆమె అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు పూజ మహేష్ తో మహర్షి సినిమా చేస్తున్నది.  అరవింద బాగుంది అని టాక్ వస్తే మహర్షికి ఢోకా లేదు.  ఏదైనా తేడా జరిగితే.. ? ఏమో ఏదైనా జరగొచ్చు.