ప్రభాస్ అమోర్.. జాన్ గా మారుతుందా..?

ప్రభాస్ అమోర్.. జాన్ గా మారుతుందా..?

బాహుబలి 2 తరువాత ప్రభాస్ మరో సినిమా రిలీజ్ కాలేదు.  సాహో సినిమా షూటింగ్ జారుతూనే ఉన్నది.  వచ్చే ఏడాది సమ్మర్ కు గాని ఈ సినిమా రిలీజ్ కాదు.  దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.  హాలీవుడ్ రేంజ్ లో సినిమాను తీర్చి దిద్దుతున్నారు. 

సాహో షూటింగ్ లో ఉండగానే ప్రభాస్ 20 వ సినిమా పట్టాలెక్కింది.  జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.  ఇటీవలే ఇటలీలో షూట్ ప్రారంభమైంది.  పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమోర్ అనే టైటిల్ ను సెట్ చేస్తున్నారని మొన్నటి వరకు సమాచారం.  ఇప్పుడు టైటిల్ అది కాదని, జాన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని అంటున్నారు.  ఈ రెండు టైటిల్స్ లో దీనిని సినిమా టైటిల్ గా పెడతారో చూడాలి.  యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి.  ఇందులో పూజ హెగ్డే హీరోయిన్.