సలార్ హీరోయిన్ విషయంలో ప్రశాంత్ ప్లాన్ అదేనా..?

సలార్ హీరోయిన్ విషయంలో ప్రశాంత్ ప్లాన్ అదేనా..?

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాధేశ్యామ్ పూర్తయ్యేసరికి మరో సినిమాను పట్టాలెక్కించాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాల్లో చేయనున్నాడు. ఒకపక్క బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌లో ఆదిపురుష్ ప్రారంభం కానుంది. మరో పక్క పాన్ ఇండియా రేంజ్ డైరెక్షన్ ప్రశాంత్ నీల్ తన సినిమా సలార్‌ను మొదలు పెట్టేశాడు. అయితే ప్రస్తుతం ఓం రౌత్ తన సినిమాలో ప్రభాస్ లేని సన్నివేశాలు చిత్రీకరించనున్నాడట. దాంతో ప్రస్తుతానికి తనకు ప్రభాస్‌తో పనిలేదని అంటున్నాడట. ఇక ప్రశాంత్ నీల్ విషయానికొస్తే సలార్ సినిమా కేవలం 45రోజుల్లో ముగించాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ సినిమాకి ఇంకా హీరోయిన్ ఫిక్స్ అవ్వని సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌ పాత్ర కోసం కొందరు బీటౌన్ భామల్ని కలిసినా లాభం లేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీలందరూ వరుస సినిమాలు చేస్తూ ఉండటంతో హీరోయిన్‌ దొరకడం లేదు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ కోసం కొత్త వారిని కూడా చూశాడట. ఇందుకుగాను ఆడిషన్స్ జరిపించాడట. సినిమాలో హీరోయిన్ పాత్ర అంతగా ఉండదని దాంతో ఆ పాత్రకు పెద్ద స్టార్ హీరోయిన్ అవసరం లేదని ప్రశాంత్ భావిస్తున్నాడట. దీంతో మరికొన్న రోజుల్లో సలార్ సినిమా హీరోయిన్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఇందులో హీరోయిన్‌గా కొత్త భామ పరిచయం అవుతుందా లేదా ఎవరైనా స్టార్ హీరోయిన్ చేయనుందా అనేది తెలుస్తుంది.