రజిని కాలాకు సీక్వెల్ వస్తుందా ..?

రజిని కాలాకు సీక్వెల్ వస్తుందా ..?

రజినీకాంత్ తో కబాలి, కాలా సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు పా రంజిత్.  దళిత రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఆదరణ పొందాయి.  ముఖ్యంగా కాలా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.  సినిమాకు కొంత నెగెటివ్ టాక్ వచ్చినా... ఆ తరువాత పుంజుకుంది.  పా రంజిత్ టేకింగ్ నచ్చడంతో బాలీవుడ్ నిర్మాతలు ఆయనతో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు.  

ప్రస్తుతం బాలీవుడ్ లో పిర్సాముండా అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.  షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  అటు తమిళంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.  సినిమా రంగంలో బిజీగా ఉంటూనే సేవా రంగంలోకి అడుగుపెట్టి నీలం అనే ఫౌండేషన్ ను స్థాపించాడు.  ఈ ఫౌండేషన్ ద్వారా పిల్లలకు పుస్తకాలు, గ్రంధాలయాలు స్థాపిస్తున్నాడు.  ఇప్పటికే తమిళనాడులో పలుచోట్ల గ్రంధాలయాలు స్థాపించాడు రంజిత్.  కాలా సినిమాకు సీక్వెల్ చేస్తారా అని అడిగితె...కాలా సినిమా ఒక్కటే వస్తుంది.  దానికి సీక్వెల్ చేయలేం.  ఆ తరహా సినిమాలు భవిష్యత్తులో చేస్తానని చెప్పాడు రంజిత్.