ఖిలాడీ టీజర్ వచ్చేది అప్పుడేనా..?

ఖిలాడీ టీజర్ వచ్చేది అప్పుడేనా..?

మాస్ మహరాజ్ రవితేజా క్రాక్ సినిమాతో ఈ ఏడాదిని ప్రారంభించారు. క్రాక్ సినిమా తరువాత రవితేజ చేస్తున్న సినిమా ఖిలాడీ. ఈ చిత్రం కూడా పక్కా మాస్ మసాలా సినిమా అని అర్థం అవుతోంది. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఖిలాడీ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో సమానంగా అప్‌డేట్‌లు కూడా వస్తూ అభిమానులను అలరిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ఎప్పుడంటూ అభిమానులు అంటున్నారు. అయితే ఈ మేరకు ఖిలాడీ టీజర్ గురించి సినీ సర్కిల్స్‌లో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. శివరాత్రి సందర్భంగా హీరోలందరూ తమతమ సినిమా అప్‌డేట్‌లను ఇస్తున్నారు. అదే రోజున ఖిలాడీ టీజర్ కూడా విడుదలవుతుందని అంటున్నారు. ఈ సినిమా టీజర్ విుడదల చేసేందుకు ఖిలాడీ టీమ్ కూడా సన్నద్దం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. అంతవరకు సినిమా టీజర్ వస్తుందా లేదా అనేది తిలీదు. ఈ సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. మరి సంక్రాంతికి అలరించిన రవితేజ ఖిలాడీ సినిమాతో ఏమాత్రం మెప్పిస్తారో వేచి చూడాలి.