రెడ్‌ సంక్రాంతి బరిలో తలపడుతుందా?లేదా?

రెడ్‌ సంక్రాంతి బరిలో తలపడుతుందా?లేదా?

ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం హీరోగా ‘రెడ్’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. అయితే థియేటర్లలోనే విడుదాల చేయాలని చిత్ర యూనిట్ ఉద్దేశ్యం. ఈ సినిమా తిరుమత కిషోర్ దర్శకత్వంలో రూపొందింది. సినిమా పూర్తయిందనుకున్న సమయంలో థియేటర్ల మూడబడటంతో సినిమా విడుదల వాయిదా పడింది. అప్పటికీ ఓటీటీ ఆఫర్లు వచ్చినా వాటిని తిరస్కరించింది. కాస్త ఆలస్యం అయినా థియేటర్లలోనే విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచిస్తోంది.అయితే థియేటర్ల ఓపెనింగ్‌కి ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో చాలా సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. అయితే ఈ నెల కాకపోయినా వచ్చే నెల సంక్రాంతి బరిలో తలపడేందుకు చాలా సినిమాలు సన్నద్దమవుతున్నాయి. సినిమా థియేటర్ల ఓ పెనింగ్ ఖరారు అయినా సినిమా విడుదలపై మాత్రం ఓ నిర్ణయం తెలపడం లేదు. దాంతో సంక్రంతికి రెడ్ రానుందా..లేదా.. అనే సందేహాలు అభిమానుల్లో వచ్చాయి. ఎందుకంటే సినిమా విడుదలకు సంబంధించి ఇప్పటికే డేట్ ఫిక్స్ చేయాలి. థియేటర్ల ఓపెనింగ్ కాస్త సందేహంగా ఉన్నప్పుడే కొన్ని సినిమాలు విడుదలకు డేట్స్ ఇచ్చాయి. మరి రెడ్ ఎందుకు స్పందించడం లేదు. ఈ సినిమాపై భారీ అంచానాలతో ప్రేక్షకులతో పాటు, కచ్చితంగా మరో మాస్ హిట్ కొడతానన్న నమ్మకంతో హీరో రామ్ కూడా ఉన్నాడు. మరి ఈ సినిమా విడుదలపై క్లారిటీ ఎప్పుడు ఇస్తుందో చూడాలి.