ఎన్టీఆర్ హీరోయిన్ ఫైనల్ కాకుండానే.. జరుగుతుందా?

ఎన్టీఆర్ హీరోయిన్ ఫైనల్ కాకుండానే.. జరుగుతుందా?

ఆర్ఆర్ఆర్ సినిమా గురించిన ఎలాంటి చిన్న న్యూస్ బయటకు వచ్చినా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. రాజమౌళి సినిమాల్లో ఎప్పుడు ఎలాంటి వివాదాలు ఉండవు.  ఈ సినిమా విషయంలో మాత్రం కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి.  ఎన్టీఆర్ హీరోయిన్ గా మొదట డైసీ ఎడ్గర్ ను తీసుకున్నారు.  ఆమె కొన్ని పర్సనల్ కారణాల వలన పక్కకు తప్పుకుంది.  దీంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు.  ఇప్పటి వరకు ఫైనల్ కాలేదు.  

ఎవర్ని తీసుకుంటారు అనే ఉత్కంఠత మొదలైంది.  రాజమౌళి పరిశీలనలో కొన్ని పేర్లు ఉన్నా వారిలో ఎవర్ని ఫైనల్ చేస్తారు అన్నది డౌట్ గా మారింది.  రామ్ చరణ్ కు బాలీవుడ్ టాప్ హీరోయిన్ ను తీసుకున్నారు కాబట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కూడా ఆ రేంజ్ హీరోయిన్ ను తీసుకోవాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ మొదలుకాబోతున్నది.  ఈ షెడ్యూల్ లో హీరోయిన్లు పాల్గొనాలి.  అలియా భట్ ఈ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్నది.  ఎన్టీఆర్ హీరోయిన్ పరిస్థితి ఏంటి.  ఎన్టీఆర్ హీరోయిన్ లేకుండానే షెడ్యూల్  స్టార్ట్ చేస్తారా అన్నది తెలియాలి.