శ్రద్దాకు అనుగుణంగా మారుస్తున్నారా..?

శ్రద్దాకు అనుగుణంగా మారుస్తున్నారా..?

ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.  మరోవైపు ఎన్టీఆర్ కు హీరోయిన్ అనుకున్న బ్రిటిష్ నటి డైసీ కొన్ని కారణాల వలన పక్కకు తప్పుకోవడంతో హీరోయిన్ వేటలో పడింది యూనిట్.  టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నుంచి అనేక పేర్లను పరిశీలించారు. చివరకు సాహో హీరోయిన్ శ్రద్దా కపూర్ పేరును ఫైనల్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉండనే విషయం తెలియాలి.  

కొమరం భీమ్ పాత్రను చేస్తున్న ఎన్టీఆర్ కు కథ ప్రకారం బ్రిటిష్ యువతి కావాలి.  స్వాతంత్య్రానికి పూర్వం స్టోరీ కావడంతో బ్రిటిష్ యువతి అనుకున్నారు. డైసీ తప్పుకోవడంతో మరో బ్రిటిష్ హీరోయిన్ ను తీసుకోవాలి అంటే మరలా హాలీవుడ్ క్యాస్టింగ్ ఏజెన్సీలను సంప్రదించాలి.  చాలా ప్రాసెస్ ఉంటుంది.  అదంతా ఎందుకులే అని చెప్పి.... బాలీవుడ్ హీరోయిన్ తో సరిపెట్టుకోవాలి చూస్తున్నట్టు సమాచారం.  ఒకవేళ శ్రద్దా డేట్స్ ఖాళి లేకుంటే.. పరిణీతి చోప్రాను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.