సుహానా రెడీ అవుతుందా..?

సుహానా రెడీ అవుతుందా..?

షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతుందా అంటే అవుననే అంటున్నారు.  సుహానా ఖాన్ రీసెంట్ గా ప్రముఖ మ్యాగజైన్ వోగ్  కవర్ పేజీకి ఫోజులు ఇచ్చింది.  అదిరిపోయే విధంగా ఆ ఫోజులు ఉన్నాయి.  గౌరీఖాన్.. షారుక్ ఖాన్ సమక్షంలో ఈ ఫోటో షూట్ జరిగినట్టు తెలుస్తోంది.  

సుహానా ఖాన్ సినిమాల్లోకి రాబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నా దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.  ఇప్పటికే స్టార్ హీరోల కూతుర్లు కొందరు బాలీవుడ్ లో సినిమా రంగంలోకి అడుగుపెట్టి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.  ఈ బాటలోనే సుహానా ఖాన్ కూడా నడవబోతుందని తెలుస్తోంది.  ఎప్పుడు ఆమె సినిమాల్లోకి వస్తుందా అని బాలీవుడ్ బాద్షా అభిమానులు ఎదురుచూస్తున్నారు.