సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా? 

సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా? 

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 18 వ తేదీన జరగాల్సి ఉన్నది.  అయితే, కొన్ని అనుకోని కారణాల వలన ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.  అఫీషియల్ గా అనౌన్స్ కాకపోయినా.. అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22 వ తేదీన నిర్వహించే అవకాశం ఉన్నది.  దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడే అవకాశం ఉన్నది.  

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది.  తొలితెలుగు స్వాతంత్ర సమరయోధుడు కావడం, ఆయన చరిత్ర గురించి పెద్దగా బయట పరిచయం లేకపోవడంతో ఆసక్తి నెలకొంది.  పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నారు.