నటి శ్రావణి ఆత్మహత్యకు ఆ మెసేజ్ కారణమా...!!

నటి శ్రావణి ఆత్మహత్యకు ఆ మెసేజ్ కారణమా...!!

బుల్లితెర నటి శ్రావణి ఇటీవల తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.  టీవీ సీరియల్ లో మంచి పేరు తెచ్చుకున్న నటి మరణంతో టీవీ రంగం ఒక్కసారిగా షాక్ అయ్యింది.  ఈ కేసును ఎస్ఆర్ నగర్ పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తున్నారు.  ఈ కేసుతో సంబంధం ఉన్న దేవరాజ్, సాయికృష్ణలను పోలీసులు ఇప్పటికే విచారించారు.  ఈ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.  దేవరాజ్ పెళ్లి చేసుకోను అని చెప్పడంతో శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు.  పెళ్లి చేసుకోనంటూ శ్రావణికిదేవరాజ్ మెసేజ్ పంపించినట్టు పోలీసులు గుర్తించారు.  దేవరాజ్ పంపిన మెసేజ్ చూసిన శ్రావణి తీవ్ర ఆవేదనకు గురైనట్టు పోలీసులు విచారణలో తేలింది.  దేవరాజ్ పెళ్లి చేసుకోనని చెప్పడం, సాయికృష్ణను పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యులు శ్రావణిపై ఒత్తిడి తీసుకురావడంతో శ్రావణి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.  ఈ కేసులో ఇప్పటికే దేవరాజ్, సాయికృష్ణ పోలీసులు విచారించారు.  ప్రస్తుతం వీరిద్దరూ పోలీసుల ఎస్ఆర్ నగర్ పోలీసుల వద్ద ఉన్నట్టుగా తెలుస్తోంది.  రేపు ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది.  రేపు వీరిని అరెస్ట్ చెయ్యొచ్చని పోలీసులు చెప్తున్నారు.