ఇదే మెయిన్ ట్విస్టైతే...RRR బంపర్ హిట్టే..!!

ఇదే మెయిన్ ట్విస్టైతే...RRR బంపర్ హిట్టే..!!

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్  అయినప్పటికీ ఇప్పటి వరకు సినిమా టైటిల్, జానర్, కథ వివరాలు ప్రకటించలేదు.  ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేందుకు ఇలా చేసి ఉండొచ్చు.  ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  ముఖ్యంగా కథ గురించి.  

ఈ సినిమా 1930 కాలంలో మొదలయ్యి 2020 వరకు ట్రావెల్ అవుతుందని, ఇది రెండు జన్మలకు సంబంధించిన కథ అని పుకార్లు వినిపిస్తున్నాయి.  ఇందులో చరణ్, ఎన్టీఆర్ లు అన్నదమ్ములుగా కనిపిస్తున్నారట.  ఈ ఇద్దరు విలన్ పై ఎలా పగతీర్చుకుంటారు అన్నది కథ అని చెప్తున్నారు.  కొంతమంది మాత్రం ఇందులో ఎన్టీఆర్ రామ్ చరణ్ కు స్నేహితుడిగా, విలన్ గా కనిపించబోతున్నారని అంటున్నారు.  ఇందులో ఏది నిజం అనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.