విశ్వక్ సేన్ న్యూ లుక్ 'పాగల్' కోసమేనా ..?

విశ్వక్ సేన్ న్యూ లుక్ 'పాగల్' కోసమేనా ..?

హిట్ సినిమా హిట్ కొట్టడంతో మంచి జోరుమీదున్నాడు హీరో విశ్వక్ సేన్ . త్వరలో  'పాగల్' గా రానున్నాడు ఈ యంగ్ హీరో .ఫలక్ నామా దాస్ మరియు హిట్ సినిమాలు సక్సెస్ అవడంతో విశ్వక్ సేన్ మార్కెట్ బాగా పెరిగింది.ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. దాంతో సినిమా కథలు విషయం లో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు  విశ్వక్ సేన్.  నూతన దర్శకుడు నరేష్ నరేష్ కుప్పిలి , బెక్కం వేణుగోపాల్  దర్శకత్వంలో రూపొందుతున్న "పాగల్ "  ఆ మధ్య పూజా కార్యక్రమాలు జరుపుకుంది.అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఇంకా మొదలుకాలేదు . త్వరలోనే షూటింగ్ ను మొదలు పెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అర్జున్ రెడ్డి' సినిమాకు మ్యూజిక్ అందించిన రధాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. విశ్వక్ సరసన హీరోయిన్ గా కొత్త అమ్మాయిని అనుకుంటున్నారట చిత్ర యూనిట్.  ఈ సినిమాలో విశ్వక్ సేన్ లుక్ ఆకట్టుకుంటున్నాడని తెలుస్తుంది.  తాజాగా విశ్వక్ కు సంబందించిన ఓ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా విశ్వక్ సేన్ ఓ ఫోటో షూట్ లోపాల్గొన్నాడు. దానికి సంబందించిన ఫోటో ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు . ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక 'పాగల్' సినిమాలో కూడా ఇదే లుక్ తో కనిపించబోతున్నాడని అభిమానులు అనుకుంటున్నారు.