థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ పై భారీ ఆశలు..

థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ పై భారీ ఆశలు..

అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా థగ్స్ ఆఫ్ హిందూస్తాన్.  ఈరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.  ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోలు ముగిశాయి.  ఇండియన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అసలు ఉన్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా 7000 స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ అవుతున్నది.  

మొదటిరోజు రూ.50 కోట్ల రూపాయల వసూళ్లు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నది.  మొదటి రెండు మూడు రోజుల్లోనే వంద కోట్లు కలెక్ట్ చేసి విజయం సాధించాలని ఉవ్వీళ్ళూరుతున్నది.  హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉన్నది.. ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.