ఇషా అంబానీ ఎంగేజ్‌మెంట్‌ ఈవారంలోనే

ఇషా అంబానీ ఎంగేజ్‌మెంట్‌ ఈవారంలోనే

రిలయన్స్ గ్రూప్‌ అధినేత ముకేష్‌ అంబానీ కుమార్తె ఇషా  వివాహం.. కుమారుడు ఆకాష్‌ వివాహంకన్నా ముందే జరుగుందా?. పిరమల్‌ గ్రూప్‌ అధినేత అజయ్‌ పిరమల్‌ కుమారుడు ఆనంద్‌ పిరమల్‌తో ఇషా అంబానీ పెళ్ళి జరుగుతుందని ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే ముకేష్‌ అంబానీ కుమారుడు ఆకాష్‌ అంబానీ ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయం తెలిసిందే. అయితే ముందుగా ఇషా అంబానీ పెళ్ళి జరుగుతుందని ముంబై మీడియా రాస్తోంది. ఇషా అంబానీ ఎంగేజ్‌మెంట్‌ ఈ నెల 21న(శుక్రవారం) జరుగనుంది. ఈ ఎంగేజ్‌మెంట్‌ అంబానీల గృహం అంటిలియాలో జరగనుంది. వివాహం మాత్రం ఇటలీలోని కొమో సరస్సులో జరుగుతుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.