ఈషా అంబానీ వివాహ ముహుర్తం ఖరారు

ఈషా అంబానీ వివాహ ముహుర్తం ఖరారు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ముద్దుల కుమార్తె ఈశా అంబానీ వివాహ ముహుర్తం ఫిక్స్ అయింది. అజయ్ పిరమాల్ తనయుడు ఆనంద్ పిరమాల్ తో డిసెంబర్ 12న పెళ్లి జరగబోతుంది. పెళ్లి తంతు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్లి వేడుకను ముంబయిలోని ముకేశ్‌ అంబానీ స్వగృహంలోనే నిర్వహిస్తున్నట్లు ఇరు కుటుంబాలు ధ్రువీకరించాయి. వివాహ వేడుకకు ముందు వారాంతంలో అంబానీ, పిరమాల్‌ కుటుంబాలు, వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఉదయ్‌పుర్‌లో ఘనంగా విందు ఏర్పాటు చేయబోతున్నారు.

నిన్న ముంబయిలోని సిద్ధి వినాయకున్ని అంబానీ కుటుంబం దర్శించుకుంది. ఈషా అంబానీ, ఆనంద్ పిరమిల్ మొదటి వెడ్డింగ్ కార్డును సిద్ధివినాయకునికి సమర్పించి పూజలు నిర్వహించారు. వీరితో పాటు ముఖేష్ తల్లి కోకిలా బెన్ అంబానీ, ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఉన్నారు. గత నెల ఆయన కూతురు ఇషా అంబానీ, ఆనంద్ పిరిమిల్ ఎంగేజ్ మెంట్ ఇటలీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.