ఈష సంగీత్ కు... దిగివచ్చిన తారలు

ఈష సంగీత్ కు... దిగివచ్చిన తారలు

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. కూతురు నీతా అంబానీ,ఆనంద్ పిరమిల్ వివాహానికి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యి. నీతా, ఆనంద్ పిరమల్ ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఉదయ్ పూర్ లో జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ హ్లింటన్ ఉదయ్ పూర్ కు చేరుకున్నారు. ఈ సంగీత్,మెహందీ కార్యక్రమానికి తారా లోకం మొత్తం దిగివచ్చింది. కొత్త జంట ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోన్స్ కూడా ఉదయ్ పూర్ కు వచ్చారు. ఇంకా విద్యా బాలన్ ,సిద్ధార్థ్ రాయ్ కపూర్, జాన్ అబ్రాహాం, ప్రియా రంచల్, సచిన్ టెన్ డుల్కర్ ఆయన భార్య అంజలీ టెన్ డుల్కర్, అనిల్ కపూర్,సల్మాన్ ఖాన్, కరిష్మా కపూర్ తదితరులు పొల్గొన్నారు.  నీతా, ఆనంద్  ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ , పెళ్లి వేడుకలు పూర్తి ప్రైవేటు  కార్యక్రమం. ప్రి వెడ్డింగ్ లో పలు సంగీత్, మెహందీ తో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నీతా, ఆనంద్ పిరమల్ పెళ్లి డిసెంబర్ 12న జోధ్ పూర్ జరుగనుంది.