'ఇషా అంబానీ' వెడ్డింగ్ కార్డు చూశారా..

'ఇషా అంబానీ' వెడ్డింగ్ కార్డు చూశారా..

ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఇషా అంబానీ, పిరమాల్‌ గ్రూప్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ ల వివాహం డిసెంబర్ 12 న ముంబయిలో ఘనంగా జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి పనుల హడావిడి నెలకొంది. అయితే ఇషా, ఆనంద్ వివాహ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆహ్వాన పత్రిక రెండుగా విభజించి ఉంది. మొదటి బాక్స్ లో ఇషా, ఆనంద్ పేర్లలోని మొదటి అక్షరాలను IA అని ఇంగ్లీష్ లో ఉంచారు. రెండవ బాక్స్ లో సరస్వతి అమ్మవారి చిత్ర పటం దర్శనమిస్తున్నాయి.

ఈమధ్యే అంబానీ కుటుంబ సభ్యులు ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయకుని ఆలయాన్ని సందిర్శించారు. ఇషా - పిరమిల్‌ల తొలి వివాహ ఆహ్వాన పత్రికను వినాయకుని పాదాల చెంత ఉంచి ఎటువంటి విఘ్నాలు లేకుండా తమ కుమార్తె వివాహం జరగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో ముకేష్‌ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ - శ్లోకా మెహతాల తొలి నిశ్చితార్థపు ఆహ్వాన పత్రికను కూడా ఇదే ఆలయంలో ఉంచి పూజలు జరిపారు.