ఉదయ్ పూర్ చేరుకున్న హిల్లరీ క్లింటన్

 ఉదయ్ పూర్ చేరుకున్న హిల్లరీ క్లింటన్

రిలయన్స్ అధినేత ముఖేశ్‌ అంబానీ కుమార్తె ఈశా అంబానీ వివాహం.. ఆనంద్ పిరమాల్‌తో ఈ నెల 12న ఉదయ్‌పూర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ముందస్తు వివాహ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా నుంచి డెమోక్రటిక్‌ పార్టీ నాయకురాలు హిల్లరీ క్లింటన్‌ ఉదయ్‌పూర్‌కు చేరుకున్నారు. భారతీయ సంప్రదాయ వస్త్రధారణను ప్రతిబింబించేలా ఆమె చుడీదార్‌లో వచ్చారు. వ్యాపార సామ్రాజ్యానికి చెందిన ప్రముఖులు కూడా పెళ్లి వేడుకలకు తరలివచ్చారు. మిట్టల్ ఇండస్ట్రీస్ అధినేత లక్ష్మి మిట్టల్, ఉషా మిట్టల్, ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్ శిక్కా, నోకియా నుంచి రాజీవ్ సూరీ, హఫింగ్టన్ పోస్ట్ నుంచి అరియానా, టీవీ హోస్ట్ ఫరీద్ జకారియా, అనిల్ కపూర్, డేవిడ్ ధావన్, విద్యాబాలన్, సిద్ధార్థరాయ్ కపూర్, జాన్ అబ్రహాం - ప్రియా రాంచల్, జావేద్ జాఫ్రీ, సచిన్ టెండుల్కర్ - అంజలీ టెండుల్కర్, కొత్త జంట ప్రియాంకా చోప్రా - నిక్ జోనస్, సాక్షి సింగ్ ధోనీ, ధోనీ కుమార్తె జీవా కూడా ఉదయ్‌పూర్‌కు తరలివచ్చారు.