మ్యాచ్ కు ముందే ఢిల్లీ జట్టుకు గట్టి దెబ్బ...

మ్యాచ్ కు ముందే ఢిల్లీ జట్టుకు గట్టి దెబ్బ...

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఇంకా ఐపీఎల్ 2020 లో తమ ప్రయాణం ప్రారంభించకముందే గట్టి దెబ్బ తగిలింది. ఈ జట్టు లో పేస్ విభాగాన్ని కగిసో రబడా తో పాటుగా భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ చూసుకుంటాడు. కానీ నిన్న రాత్రి ప్రాక్టీస్ సెషన్‌లో ఇషాంత్ వీపుకు గాయమైందని సమాచారం. ఇక ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ తమ మొదటి మ్యాచ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో ఆడనుంది. అయితే అతను ఈ రోజు ఆటగలడో లేదో తెలియడం లేదు. ఢిల్లీ సపోర్ట్ స్టాఫ్ మెంబర్ ఒకరు..  నిన్న శిక్షణ సమయంలో ఇషాంత్ తనను తాను గాయపరచుకున్నాడని తెలిపాడు. అలాగే ఆటకు ముందు అతని గాయం స్థితిని మేము అంచనా వేస్తాము. అయితే అతను ఆడగలడా లేదా అనేది ఈ రోజు మ్యాచ్ ప్రారంభం సమయానికి ముందు మా వైద్య బృందం తెలుపుతుంది అని చెప్పాడు. ఇక 2019 ఐపీఎల్ లో కూడా ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన ఇషాంత్ 13 మ్యాచ్‌లు ఆడి 7.58 ఎకానమీ రేటుతో 13 వికెట్లు పడగొట్టాడు.