భారత్ కి షాక్... ఇషాంత్ కు గాయం...! 

భారత్ కి షాక్... ఇషాంత్ కు గాయం...! 

భారత్ న్యూజిలాండ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి టెస్ట్ లో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన కోహ్లీ సేన కనీసం రెండో టెస్ట్ లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందే టీం ఇండియా కి ఎదురు దెబ్బ తగిలింది. అయితే మొదటి టెస్ట్ లో భారత బౌలర్లలో రాణించిన ఒకేఒక్క బౌలర్ ఇషాంత్ శర్మ... ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి తన కెరియర్ లోనే 11 సారి 5 వికెట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఈ సిరీస్ కు ముందు గాయం కారణంగా తుది జట్టులో స్థానం కోల్పోయిన లంబూ చివరి నిమిషం లో మళ్ళీ తన ఫిట్నెస్ నిరూపించుకొని జట్టులో స్థానం దకించుకున్నాడు.

అందువల్ల ఇషాంత్ ను అత్యవసరంగా న్యూజిలాండ్ కు తరలించింది బీసీసీఐ. అందువల్ల మ్యాచ్ కు ముందు రెండు రోజులు కలిపి కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోయాడు మన లంబూ. అయితే ఇప్పుడు ఆ ప్రభావం అతని పై పడింది. మొదటి టెస్ట్ నాలుగు రోజులు ఆడిన ఇషాంత్ తరువాత వరుసగా నెట్స్‌లో బంతులు విసురుతు ప్రాక్టీస్ చేసాడు. అయితే నిన్న ప్రాక్టీస్ సమయం లో మడమ నొప్పి రావడం తో వైద్యపరీక్షలకు పంపించారు. అందువల్ల ఇషాంత్ ఇక రెండో మ్యాచ్ ఆడలేదని సమాచారం. అందుకొరకు ఇషాంత్ స్థానం లో ఉమేష్ యాదవ్ ని తుది జట్టులోకి తీసుకోనున్నారని సమాచారం. అయితే ఇషాంత్ దూరం కావడం భారత్ కి గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అయితే చూడాలి మరి రెండో టెస్ట్ లో మిగితా బౌలర్లు ఏ విధంగా రాణిస్తారో అనేది.