మీరు ఏమైనా చేసుకోండి... కానీ బ్యాన్ కావద్దు : కోహ్లీ

మీరు ఏమైనా చేసుకోండి... కానీ బ్యాన్ కావద్దు : కోహ్లీ

టీమ్ ఇండియా పేసర్ ఇశాంత్ శర్మ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో లైవ్ లో 2017 లో బెంగళూరు టెస్ట్ మ్యాచ్ సందర్భంగా స్టీవ్ స్మిత్‌పై తాను చేసిన వెకిలి చర్య గురించి  మాట్లాడారు. స్టీవ్ స్మిత్‌పై చాలా రియాక్షన్‌లో ఇశాంత్ తన సహచరులను, అభిమానులను కాసేపు నవ్వించాడు. 97 టెస్ట్ మ్యాచ్‌లలో అనుభవజ్ఞుడైన ఇశాంత్ స్టీవ్ స్మిత్‌ను స్లెడ్జింగ్ సంఘటన పై విరాట్ కోహ్లీ స్పందన గురించి కూడా మయాంక్ అడిగారు. మయాంక్ ప్రశ్నకు సమాధానం ఇస్తూ... "అతను దూకుడుగల కెప్టెన్, మీరు కూడా ఆ విధంగా దూకుడుగా ఉంటె అతను ప్రేమిస్తాడు. అతను ఎప్పుడూ నాకు వికెట్ తెచ్చి మీకు కావలసినది చేసుకోండి కానీ మీరు ఆట నుండి బ్యాన్ కావద్దు అని చెబుతాడు అని ఇశాంత్ శర్మ అన్నారు. భారత్ తరఫున ఇషాంత్ శర్మ 297 వికెట్లు తీసి ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. 2019 లో కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌పై ఈ యాభై పరుగులు సాధించాడు ఆ మ్యాచ్ లో ఇశాంత్ శర్మ భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు .