పేలుళ్ల వెనుక వారి హస్తం..! 

పేలుళ్ల వెనుక వారి హస్తం..! 

శ్రీలంకలో మారణహోమానికి సూసైడ్ బాంబ‌ర్లే కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ పేలుళ్ల వెనుక అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ ఐసిస్ హస్తమున్నట్లు శ్రీలంక ప్రభుత్వం చెబుతోంది. ఐసిస్‌ ఆత్మాహుతి దళ సభ్యులే ఈ ఘటనకు కారణమని శ్రీలంక భద్రతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా.. రెండు ప్రాంతాల్లో ఐసిస్‌ ఆత్మాహుతి దాడులకు పాల్పడినట్లు ధ్రువీకరించారు. 
కొలంబోలోని షాంగ్రిలా హోట‌ల్‌లో ఈనెల 20వ తేదీన రూమ్‌ను బుక్‌ చెసుకున్న ఇద్దరు అనుమానితులే ఈ సూసైడ్‌ బాంబర్లని అంచానా వేస్తున్నారు. వీరిద్దరూ ఇస్లామిక్‌ తీవ్రావాదును భావిస్తున్నారు. పేలుళ్ల కోసం సుమారు 25 కిలోల బాంబులు వాడినట్టు తెలుస్తోంది. ఇక.. ఇవాళ జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య 167కి చేరింది.