భారత్ మీద ఐసిస్ ప్లాన్...భారీ విధ్వంసానికి కుట్ర  !

భారత్ మీద ఐసిస్ ప్లాన్...భారీ విధ్వంసానికి కుట్ర  !

 

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అయిన ఐసిస్ భారత్ లో భారీ విద్వంసానికి కుట్ర పన్నినట్టు సమాచారం అందుతోంది. నిజానికి జమ్ముకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్‌ లో విధ్వంసానికి పాల్పడతారని ప్రచారం జరిగింది. దానికి ఊతం ఇస్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా పుల్వామా దాడులు లాంటివి మరిన్ని జరుగుతాయంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే తాజాగా అలాంటి సమాచారమే ఇంటలిజెన్స్ వర్గాలకి అందుతోన్నట్టు చెబుతున్నారు.

ప్రపంచాన్ని మొత్తాన్ని ఇస్లాం రాజ్యం చేయాలనే లక్ష్యంతో ఏర్పాటయిన ఐసిస్‌ మద్దతుతో జైషే,లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈనెల 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దానికంటే ముందే భారత్ లో భారీ విధ్వంసానికి కుట్ర చేస్తున్నారని ఇంటెలిజెన్స్‌ వర్గాల నుండి అందుతున్న సమాచారం. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, ఎయిర్‌పోర్టులను లక్ష్యంగా చేసుకుని బక్రీద్‌ రోజున కానీ లేదా పంద్రాగస్టున కానీ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

దీంతో భద్రతా బలగాలను ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తం చేసినట్టు చెబుతున్నారు. భారత్‌ తీసుకున్న నిర్ణయం వల్ల మరిన్ని పుల్వామా తరహా దాడులు జరిగే అవకాశం ఉందని స్వయంగా పాక్ ప్రధాని ప్రకటించడంతో ఉగ్రనేతలు ఆ మాటలను నిజం చేయాలని చూస్తున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ నెల 14న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనున్న పాక్ కాశ్మీరీలకు సంఘీభావంగా జరుపుకోవాలని నిర్ణయించింది. అలాగే భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘బ్లాక్ డే’ నిర్వహించాలని కూడా ఆ దేశం నిర్ణయించింది.