కర్ణాటక, కేరళలో ఐసిస్ ఉగ్రవాదుల తిష్ట.. ఐక్యరాజ్యసమితి వార్నింగ్
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల విషయంలో భారత్‌ను తీవ్రంగా హెచ్చరించింది ఐక్యరాజ్య సమితి.. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో ఆ సంస్థ ఉగ్రవాదులు తిష్టవేశారని ఓ నివేదికలో వార్నింగ్ ఇచ్చింది. దాదాపు 150 నుంచి 200 మంది ఉగ్రవాదులు దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారనే షాకింగ్ హెచ్చరికలు జారీ చేసింది. బంగ్లా, భారత్, మయన్మార్, పాక్‌కు చెందిన 200 మంది ఉగ్రవాదులు ఈ టీమ్‌లో ఉన్నారని పేర్కొంది.. వీరంతా అల్‌ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ అధ్యక్షుడు ఒసామా మహమూద్. అసీమ్ ఉమర్ మరణానికి ప్రతీకారంగా దాడులు చేసేందుకు ప్లాన్ చేసుకున్నారని నివేదికలో పేర్కొంది.
నివేదిక ప్రకారం, 2019 మే 10న ప్రకటించిన ఐసిఎల్ ఇండియన్ అనుబంధ సంస్థ (హింద్ విలాయా)లో 180 నుంచి 200 మంది సభ్యులు ఉన్నారని ఒక సభ్య దేశం నివేదించింది.. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో గణనీయమైన సంఖ్యలో ఐసిఎల్ కార్యకర్తలు ఉన్నారని ఆ నివేదిక పేర్కొంది.. గత ఏడాది మేలో, ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూప్ భారతదేశంలో కొత్త "ప్రావిన్స్"ను స్థాపించినట్లు నివేదించింది. కాశ్మీర్లో ఉగ్రవాదులు మరియు భద్రతా దళాల మధ్య ఘర్షణల తర్వాత వచ్చిన మొదటి ప్రకటన ఇదే.. ఉగ్రవాద సంస్థ, దాని న్యూస్ ఏజెన్సీ ద్వారా, కొత్త శాఖ యొక్క అరబిక్ పేరు “విలాహ్ ఆఫ్ హింద్” గా పేర్కొంది. అయితే, జమ్మూ కాశ్మీర్ సీనియర్ అధికారి ఒకరు ఈ వాదనను తిరస్కరించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)