క‌రోనాతో ఇస్కాన్‌ చీఫ్ క‌న్నుమూత‌

క‌రోనాతో ఇస్కాన్‌ చీఫ్ క‌న్నుమూత‌

క‌రోనా ఎవ్వ‌రినీ విడిచిపెట్ట‌డంలేదు.. పేద, ధ‌నికి అనే తేడాలేదు.. భ‌క్తుడు, స్వామిజీ అనే భేదం కూడా లేదు.. తాజాగా, క‌రోనాబారిన ప‌డిన ఇస్కాన్ (ఇంటర్నేషనల్ కృష్ణ ఎమోషనల్ అసోసియేషన్) చీఫ్ భక్తిచారు మహారాజ్ స్వామిజీ.. ఇవాళ అమెరికాలో క‌న్నుమూశారు.. ఇస్కాన్ యొక్క అత్యున్నత పాలక కమిటీ పాలకమండలి అధిపతి అయిన‌ స్వామి భక్తిచారు మహారాజ్.. అమెరికాలోని ఫ్లోరిడాలో కరోనాతో తుదిశ్వాస విడిచారు. క‌రోనాబారినప‌డి యూఎస్‌లో చికిత్స పొందుతున్న ఆయ‌న‌కు గత కొన్ని రోజులుగా వెంటిలేట‌ర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మల్టీ ఆర్గాన్ వైఫల్యంతో శనివారం ఆయన క‌న్నుమూసిన‌ట్టుగా చెబుతున్నారు. 

కాగా, స్వామి భక్తిచారు మహారాజ్ ఎక్కువ సమయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఇస్కాన్ ఆలయంలో గడిపేవారు. జూన్ 3వ తేదీన ఆయ‌న‌..  ఉజ్జయిని నుండి యూఎస్ వెళ్లారు.. జూన్ 18న ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది.. ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించ‌గా.. ఆయ‌న ఇవాళ క‌న్నుమూశారు.. ఇక‌, ఆయ‌న‌ రెండుసార్లు ఇస్కాన్ పాలకమండలి కమిషన్ చైర్మన్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఇస్కాన్ వ్యవస్థాపకుడు భక్తివేదాంత స్వామి ప్రభుపాద జీ యొక్క ప్రియమైన శిష్యులలో భక్తిచారు స్వామి జీ ఒకరు.