నవాజ్‌ షరీఫ్‌ శిక్ష సస్పెన్షన్‌

నవాజ్‌ షరీఫ్‌ శిక్ష సస్పెన్షన్‌

 పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ జైలు శిక్షను ఇస్లామాబాద్‌ హైకోర్టు సస్పెండ్‌ చేసింది.  అవినీతికి పాల్పడి విదేశాల్లో అక్రమ ఆస్తులు కూడబెట్టినందుకు పాకిస్తాన్‌ సుప్రీం కోర్టు నవాజ్‌ షరీఫ్‌కు 10ఏళ్ళు, ఆయన కుమార్తె మరియంకు  ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. శిక్ష అనుభవిస్తున్న నవాజ్‌ షరీఫ్‌ను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశముంది. నవాజ్‌ షరీఫ్‌ అల్లుడి జైలుశిక్షను కూడా కోర్టు సస్పెండ్‌ చేసింది.  సుప్రీం కోర్టు తీర్పుపై నవాజ్‌ షరీఫ్‌ హైకోర్టులో అప్పీల్‌ చేశారు. అప్పీల్‌పై విచారణ పెండింగ్‌లో ఉంచుతూ నవాజ్‌ షరీఫ్‌ విడుదలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.