మరోసారి బన్సాలీతో ఇస్మాయిల్ దర్బార్

మరోసారి బన్సాలీతో ఇస్మాయిల్ దర్బార్

సంజయ్ లీలా బాన్సాలీ సినిమాలు 'హమ్ దిల్ దే చుఖే సనమ్', 'దేవ్ దాస్'కు అద్బుతమైన సంగీతం అందించాడు ఇస్మాయిల్ దర్భార్. అయితే, ఆ తరువాత ఎందుకోగానీ బాన్సాలీ, దర్భార్ కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. ఇక ఇప్పుడు వాళ్లిద్దరూ మళ్లీ కలసి పని చేయబోతున్నారు. సంజయ్ బన్సాలీ మొదటి సారి ఓటీటీ కోసం చేస్తోన్న 'హీరా మండీ' అనే సిరీస్ కోసం ఏకంగా 25 పాటలు ట్యూన్ చేస్తున్నాడట ఇస్మాయిల్ దర్భార్!