ఇస్మార్ట్ హిట్టయ్యిందని సంబరపడేలోపే ఈ వివాదమేంటో..!!

ఇస్మార్ట్ హిట్టయ్యిందని సంబరపడేలోపే ఈ వివాదమేంటో..!!

పూరి ఇస్మార్ట్ శంకర్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  చాలా కాలం తరువాత పూరి సినిమా హిట్టైంది. ఈ విజయాన్ని అంగరంగ వైభవంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.  ఇలా సెలెబ్రేట్ చేసుకునే సమయంలో అనుకోకుండా ఓ సంఘటన జరిగింది.  ఈ కథ నాదే అంటూ అంటూ ఆనందం హీరో జై ఆకాష్ తెరముందుకు వచ్చాడు.  

ఒకరు ఆలోచనలను మరోమరొకరి మెదడులోకి పంపితే ఏం జరుగుతుంది అనే దానిపై సినిమా తీస్తున్నానని తమిళంలో నాన్ యార్ అనే పేరుతో సినిమా తెరకెక్కుతున్నట్టు ఆకాష్ పేర్కొన్నాడు.  తెలుగులో కొత్తగా ఉన్నాడు అనే టైటిల్ తో డబ్బింగ్ చేయాలనీ అనుకుంటున్నట్టు చెప్పాడు.  ఈ సమయంలో పూరి ఇస్మార్ట్ శంకర్ సినిమాను రిలీజ్ చేశారని, దీనిపై తమిళనాడు నిర్మాతల సంఘాన్ని ఆశ్రయిస్తానని చెప్పాడు.  ఆకాష్ కంటే ముందు ఓ రచయితా కథ తనదే అంటూ హంగామా చేశారు.  మరి వీటిపై పూరి ఎలా స్పందిస్తాడో చూడాలి.