నేను రెడీ అంటున్న ఐస్మార్ట్ శంకర్

నేను రెడీ అంటున్న ఐస్మార్ట్ శంకర్

రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న చిత్రం 'ఐస్మార్ట్ శంకర్'.  ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉన్న ఈ చిత్రం ఇంకొద్ది రోజుల్లో పూర్తికానుంది.  దీంతో చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.  జూలై 12వ తేదీన సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.  ఈమేరకు ఇంకొద్దిసేపట్లో అధికారిక ప్రకటన రానుంది.  రామ్ సరసన నిధి అగర్వాల్, నాభ నటేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.