వీరి ఆశలన్నీ ఆ సినిమాపైనే..!!!

వీరి ఆశలన్నీ ఆ సినిమాపైనే..!!!

ఇస్మార్ట్ శంకర్ సినిమా జులై 18 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  మొదట జులై 12 అనుకున్నా.. జులై 14 వ తేదీన వరల్డ్ కప్ ఫైనల్స్ ఉండటంతో.. సినిమాను వాయిదా వేసి జులై 18 వ తేదీకి వాయిదా వేశారు.  హీరోగా చేస్తున్న రామ్ కు ఈ సినిమా చాలా అవసరం.  ఖచ్చితంగా హిట్ కొట్టాలి. అలాగే, దర్శకుడు పూరి జగన్నాధ్ కు ఇప్పుడు హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది.  

జ్యోతిలక్ష్మి సినిమా తరువాత ఈ దర్శకుడికి హిట్ లేదు.  అటు హీరోయిన్ నిధి అగర్వాల్ కు, నభా నటేష్ కు ఈ సినిమా విజయం అవసరం చాలా ఉన్నది.  దీంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకు కూడా ఈ సినిమా హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.  ఈ ఆరుగురి భవిష్యత్తు ఇస్మార్ట్ శంకర్ సినిమాపైనే ఉండటం విశేషం.