పూరి మార్క్ హీరో ఇలానే ఉంటాడు !

పూరి మార్క్ హీరో ఇలానే ఉంటాడు !

పూరి జగన్నాథ్ సినిమా అంటే ఎక్కువ అంచనాలు హీరో పాత్ర మీదే ఉంటాయి.  ప్రతి సినిమాలోని కథానాయకుడి పాత్రను చిత్రంగా, వైవిధ్యంగా చూపుతుంటారు పూరి.  అందుకే ఆయన డైరెక్షన్లో  ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి హీరో కోరుకుంటాడు.  తాజాగా ఆ ఛాన్స్ రామ్ కొట్టేశాడు.  పూరి డైరెక్షన్లో అతను 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చేస్తున్నాడు. 

ఈ చిత్ర టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.  అందులో సినిమా కథ పాతదిగానే ఉంటుందనిపించినా రామ్ పోషించిన హీరో పాత్ర మాత్రం హైఎనర్జీతో రచ్చ రచ్చ చేస్తూ, పొగరుగా డైలాగ్స్ చెబుతూ ఆకట్టుకుంటోంది.  దీన్నిబట్టి పూరి మరోసారి హీరో పాత్ర మీదే నడిచే సినిమా తీసినట్టు అనిపిస్తోంది.