పిచ్చెక్కిస్తా అంటున్న 'ఇస్మార్ట్ శంకర్'

పిచ్చెక్కిస్తా అంటున్న 'ఇస్మార్ట్ శంకర్'

 

హీరో రామ్ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' అనే చిత్రం చేస్తున్నారు.  డబుల్ దిమాక్ అనే సరికొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందుతోంది.  ఇందులో రామ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండనుంది.  ఇకపోతే చిత్ర టీమ్ ఈరోజు టీజర్ రిలీజ్ చేయనుంది.  ఈ టీజర్ తప్పకుండా ప్రేక్షకులకు, అభిమానులకు పిచ్చెక్కించేలా ఉంటుందని చిత్ర సన్నిహిత వర్గాల టాక్.  పూరి జగన్నాథ్, ఛార్మీలు కలిసి  నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.  ఇందులో నాభ నటేష్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు.