చంద్రునిపై కూలిపోయిన స్పెస్‌క్రాఫ్ట్‌

చంద్రునిపై కూలిపోయిన స్పెస్‌క్రాఫ్ట్‌

చంద్రుడి మీద ప‌రిశోధ‌న‌కు వెళ్లిన ఇజ్రాయిల్‌కు చెందిన స్పేస్ క్రాఫ్ట్ బెరీషీట్ కూలింది. చంద్రునిపై స్పెస్‌క్రాఫ్ట్‌ను ల్యాండ్‌ చేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయోల్‌ ‘స్మాల్‌ కంట్రీ బిగ్‌ డ్రీమ్స్‌’ పేరిట ఈ ప్రయోగాన్ని చేపట్టింది. గురువారం స్పెస్‌క్రాఫ్ట్‌ చంద్రునిపై ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది. చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగుతున్న స‌మ‌యంలో స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం త‌లెత్తింది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని ప్రధాన ఇంజిన్ ఫెయిల్ కావ‌డంతో ఈ ప్రమాదం జ‌రిగింద‌ని శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రుడి ఫోటోలు తీయ‌డం, మ‌రికొన్ని ర‌కాల ప‌రిశోధ‌న‌లు నిర్వహించేందుకు ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించారు. 585 కిలోల బరువున్న ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా పంపించారు. 

గ‌తంలో ర‌ష్యా, అమెరికా, చైనా ప్రభుత్వ అంత‌రిక్ష సంస్థలే చంద్రుడిపై త‌మ స్పేస్‌క్రాఫ్ట్‌ల‌ను ల్యాండ్ చేశాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపై సురక్షితంగా లాండర్‌ను దించిన నాలుగో దేశంగా ఇజ్రాయెల్‌ ఘనత సాధించి ఉండేంది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమ‌న్ నెతాన్యూ కంట్రోల్ రూమ్ నుంచి ప్రయోగాన్ని వీక్షించారు.