విక్రమ్ ల్యాండర్‌పై ఇస్రో తాజా ప్రకటన ఇదే..

విక్రమ్ ల్యాండర్‌పై ఇస్రో తాజా ప్రకటన ఇదే..

చంద్రయాన్ 2 ప్రయాణంలో చివరి క్షణాల్లో అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి.. ఆ తర్వాత రకరకాల పుకార్లు షికార్లు చేశాయి.. ఇస్రో చైర్మన్ శివన్ పేరిట సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. అయితే, ఇస్రో ఛైర్మన్‌కు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో ఎలాంటి ఖాతాలు లేవని నిన్ననే క్లారిటీ ఇచ్చింది ఇస్రో.. చంద్రయాన్‌కు సంబంధించిన ఏ అధికారిక సమాచారమైన ఇస్రో ప్రకటిస్తుందని.. ఇస్రో సోషల్ మీడియాలోని అన్ని ఫ్లామ్‌ఫామ్‌ల్లో ఉందని తెలిపింది. కాగా, విక్రమ్ ల్యాండర్ ప్రస్తుత పరిస్థితిపై తాజాగా ఓ ప్రకటన చేసింది ఇస్రో.. చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగిన విక్రమ్ ల్యాండ‌ర్‌ను గుర్తించిన‌ట్లు ఇస్రో పేర్కొంది. కానీ, విక్రమ్ ల్యాండ‌ర్‌తో ఎటువంటి క‌మ్యూనికేష‌న్ జ‌ర‌గ‌లేద‌ని.. ల్యాండ‌ర్‌తో క‌మ్యూనికేష‌న్ పునరుద్ధరణకు అన్ని ప్రయ‌త్నాలు చేస్తున్నట్టు ట్విట్టర్‌లో ప్రకటించింది ఇస్రో.