మూడో ప్రపంచ యుద్ధం వస్తే అది నీటికోసమే...

మూడో ప్రపంచ యుద్ధం వస్తే అది నీటికోసమే...

మూడో ప్రపంచ యుద్ధం వస్తే అది ఖచ్చితంగా నీటి కోసమే జరుగుతుందన్నారు ఇస్రో చైర్మన్ కె. శివన్... తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఘనంగా 55వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శివన్‌ను గౌరవ డాక్టరేట్‌తో సన్మానించింది ఎస్వీ విశ్వవిద్యాలయం... ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు ఇస్రో చైర్మన్ శివన్, వీసీ ఆచార్య దామోదరం... సాతకోత్సవంలో శివన్ మాట్లాడుతూ... దేశం లో అంతరిక్ష పరిశోధనలకు మంచి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రపంచంలో దేశాలు ఇప్పుడు అధికారం కోసం పోరాడటం లేదని... సహజ వనరులు నానాటికీ కొరవడి... వాటి కోసమే పోరాటాలు మొదలవుతున్నాయన్నారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే అది ఖచ్చితంగా నీటి కోసమే జరుగుతోందన్నారు శివన్... శాస్త్ర సాంకేతిక రంగాల వైపు యువత ఆసక్తి చూపించాలని కోరిన ఆయన... ప్రతి ఒక్కరూ లోక కల్యాణం దిశగా ఆలోచనల్ని సాగించాలని... దేశానికి గర్వకారణంగా నిలవాలన్నారు.