శ్రీకాళహస్తిలో ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు..

శ్రీకాళహస్తిలో ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు..

పీఎస్‌ఎల్వీ సీ46 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమైంది... రేపు ఉదయం 5.30 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది పీఎస్‌ఎల్వీ సీ 46. ఇక ఈ ప్రయోగం విజయవంతం కావాలంటూ శ్రీకాళహస్తి దేవస్థానంలో స్వామి అమ్మ వారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ శివన్.. ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు ఇస్రో ఛైర్మన్‌.. ఉదయం స్వామివారి తోమాల సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. పీఎస్‌ఎల్వీ-సీ 46 ప్రయోగం నేపథ్యంలో తిరుమలేశుని ఆశీస్సులు పొందారు శివన్.