చంద్రుని ఉత్తర ధృవం ఎలా ఉందో చూశారా ? 

చంద్రుని ఉత్తర ధృవం ఎలా ఉందో చూశారా ? 

చంద్రుని గురించి తెలుసుకోవాలని అందరికి ఉంటుంది.  చంద్రునిపై ఎలాంటి వాతావరణం ఉంటుంది.  ఆ వాతావరణానికి తగినట్టుగా అక్కడ మనుగడ సాధ్యం అవుతుందా లేదా అనే విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.  దానికి సంబంధించిన సమాచారం కోసం నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. 

ఇటీవలే ఇస్రో చంద్రుని మీదకు చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని పంపిన సంగతి తెలిసిందే.  చంద్రయాన్ 2 లోని ఆర్బిటర్ చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తూ చంద్రుని ఉపరితలానికి సంబంధించిన  సమాచారాన్ని రాబడుతున్నది.  విక్రమ్ చంద్రునిపై దిగే క్రమంలో కూలిపోయిన సంగతి తెలిసిందే.  అయితే ఆర్బిటర్ కు అమర్చిన కెమెరాలు చంద్రున్ని ఉపరితలాన్ని ఫోటో తీసి భూమిమీదకు పంపుతున్నాయి అయితే, చంద్రుని ఉత్తర ధృవం ఎలా ఉంటుంది అనే విషయం చాలామందికి తెలియదు.  ఆ ఉత్తర ధృవానికి సంబంధించిన ఫోటోలను ఆర్బిటర్ కు అమర్చిన ఐఐఆర్ఎస్ పేలోడ్ కెమెరాలు ఫోటోలు తీశాయి.  వాటిని విశ్లేషించి ఇస్రోకు పంపాయి.  ఇస్రో ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఇప్పుడు ఈ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.