జీశాట్-31 ప్రయోగం విజయవంతం

జీశాట్-31 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఏరియానా స్పేస్ రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయానాలోని కౌరు లాంచ్ కాంప్లెక్స్ నుంచి జీశాట్ 30 విజయవంతంగా నింగిలోకి పంపింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున 2.31 గంటలకు జీశాట్‌ -31 ఉపగ్రహాన్ని నింగిలోకి దూసుకెళ్లింది. ఏరియానా రాకెట్‌ 42 నిమిషాల్లోనే కక్ష్యలోకి చేర్చింది. అత్యంత సమర్థమంతమైన కేయూ బ్యాండ్‌ ప్రసార వ్యవస్థ ఉన్న జీశాట్‌ -31 ఇస్రో సంప్రదాయ ఉపగ్రహాలైన ఇన్‌శాట్‌, జీశాట్‌లకు ఆధునిక రూపమని నిపుణులు చెబుతున్నారు. 15 ఏళ్ల పాటు నిరాటంకంగా సమాచార సేవలందించే సామర్థ్యం కల్గిన ఈ ఉపగ్రహం బరువు 2,535 కిలోలు. భారతీయ భూభాగాలు, ద్వీపాలతో పాటు అరేబియా సముద్రం, బంగాళాఖాతం పరిసరాల సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేశారు.