శరత్ కుమార్.. రాధికలకు అరెస్ట్ వారెంట్.. కారణం ఇదేనా ?

శరత్ కుమార్.. రాధికలకు అరెస్ట్ వారెంట్.. కారణం ఇదేనా ?

కోలీవుడ్ నటులు రాధిక, శరత్ కుమార్ లకు చెన్నైలోని సైదాపేట కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కారణం ఏంటి... ఎందుకు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది చూద్దాం.  శరత్ కుమార్, రాధికలు మలయాళం నిర్మాత లిస్టిన్ స్టీవెన్స్ తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్ బ్యానర్ పైన అనేక సినిమాలు చేశారు.  ఇందులో భాగంగా రాధిక శరత్ కుమార్ లు రాడాన్స్ మీడియా సంస్థ నుంచి రూ.2 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు.  

అప్పు తీర్చే క్రమంలో రాధిక సదరు మీడియాకు ఓ చెక్ ఇచ్చింది.  అయితే, ఈ చెక్ బౌన్స్ కావడంతో... రాడాన్స్ మీడియా సంస్థ సైదాపేటలోని కోర్టులో కేసును దాఖలు చేసింది.  ఈ కేసులో కోర్టుకు హాజరు కాకపోవడంతో వారికి అరెస్ట్ వారెంట్ జారీచేస్తూ.. తీర్పును జులై 12 వ తేదీకి వాయిదా వేసింది.