వైద్యులు లేరని..కాన్పు చేసిన నర్సులు

వైద్యులు లేరని..కాన్పు చేసిన నర్సులు

ప్రభుత్వా ఆస్పత్రుల్లో గర్భిణుల ప్రాణాలతో సిబ్బంది చెలగాటమాడుతున్నారు. డాక్టర్లు లేకపోయినా డెలివరీలు చేసేస్తూ శిశువుల ప్రాణాలు తీస్తున్నారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సిబ్బందే డెలివరీ చేయడంతో నిజామాబాద్, ఏలూరుల్లో ఇద్దరు శిశువులు మృతిచెందారు. 

నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడు అందుబాటులో లేకపోవటంతో గర్భిణికి సూపర్‌వైజర్‌ డెలివరీ చేసేశారు. దీంతో మగ శిశువు మృతి చెందింది. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడులోనూ ఇటువంటి ఘటనే జరిగింది. వైద్యుల పర్యవేక్షణ లేకుండా నర్స్‌లు డెలివరీ చేయడంతో మగశిశువు మృతిచెందింది. వైద్యా సిబ్బంది తీరుపై బాధిత కుటుంబసభ్యులు భగ్గుమంటున్నారు. తక్షణమే సిబ్బందిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.