ఇసుక కోసం ప్రత్యేక కాల్ సెంటర్...నేడు ప్రారంభం

ఇసుక కోసం ప్రత్యేక కాల్ సెంటర్...నేడు ప్రారంభం

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ ప్రత్యేక కాల్‌సెంటర్‌ ప్రారంభం కానుంది. ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ప్రారంభించనున్నారు. ఇసుక అక్రమ అమ్మకం, రవాణాపై ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇసుక అక్రమాలు, సమస్యలను అరికట్టేందుకు సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకోసం తన క్యాంప్‌ ఆఫీస్‌లోనే ఓ కాల్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. కాల్‌సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించనున్నారు సీఎం జగన్. అనంతరం వ్యవసాయ మిషన్‌పై సీఎం జగన్‌ సమీక్షించనున్నారు.